దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా... 11 గంటల వరకు 34.33 శాతం నమోదైంది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశారు. గర్భిణులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక లైన్లు కేటాయించి, వీల్ ఛైర్లలో కేంద్రంల్లోకి పంపిస్తున్నారు. కేంద్రం ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు... ఓటర్లు కొవిడ్ నిబంధనలు పాటించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కరోనా బాధితులు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో పీపీఈ కిట్లతో వచ్చి ఓటువేసే అవకాశం కల్పించారు.
దుబ్బాకలో ఉదయం 11గంటల వరకు 34.33 శాతం పోలింగ్ - దుబ్బాక ఉప ఎన్నికలు
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11గంటల వరకు 34.33 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ బూత్‌ల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ... ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘాతో పర్యవేక్షిస్తున్నారు.
దుబ్బాకలో ఉదయం 11గంటల వరకు 34.33 శాతం పోలింగ్
ఉపఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం సాగించాయి. ఈ క్రమంలో పలుచోట్ల ఉద్రిక్తతలు సైతం చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో 315 పోలింగ్ కేంద్రాల్లో... 89 సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలతో కలిపి మొత్తం 2వేల మందితో బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి:దుబ్బాక ఉపఎన్నికలో పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు