త్రిముఖ పోటిగా ఉన్న దుబ్బాక ఉప ఎన్నిక బరిలో 23మంది నిలిచారు. తెరాస నుంచి ఆర్థిక మంత్రి హరీశ్ రావు, కాంగ్రెస్ నుంచి పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భాజపా నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఎన్నికల బాధ్యతలు భుజానికి ఎత్తుకున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహ.. ప్రతి వ్యూహాలు పన్నారు. ప్రత్యర్థులపై ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడ్డారు. గడువు ముగియడంతో ప్రచారాలకు తెరపడింది.
సర్వం సిద్ధం
ప్రచారానికి తెరపడటంతో.... 3వ తేదీన ప్రశాంత వాతవరణంలో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 315పోలింగ్ కేంద్రాల్లో లక్షా 98 వేల 756మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 3వేల మంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే వీరికి రెండు పర్యాయాలు శిక్షణ ఇచ్చారు. ఈవీఎంల పనితీరు కూడా పరిశీలించారు. సోమవారం దుబ్బాకలోని స్ట్రాంగ్ రూం వద్ద సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
144 సెక్షన్ అమలు