సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పలువురు భాజపా నాయకులు 2020-21 కేంద్ర బడ్జెట్‌కు హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సామాన్యుల బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు.
బడ్జెట్ పట్ల హర్షం.. మోదీ చిత్రపటానికి పాలాభిషేకం - సిద్దిపేట జిల్లా ఈరోజు వార్తలు
కేంద్ర బడ్జెట్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో భాజపా నాయకులు ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సామాన్యుల బడ్జెట్ ప్రవేశపెట్టారని ప్రశంసించారు.
ఈ బడ్జెట్ లక్ష్యం ప్రజల ఆదాయం పెంచడమేనని పలువురు భాజపా నాయకులు అన్నారు. వ్యవసాయ రంగానికి రూ. 2.83 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ. 1.23 లక్షల కోట్లు, విద్యా రంగానికి రూ. 99,300 కోట్లు, ఆదాయపన్ను 5 లక్షల వరకు మినహాయింపు ఇస్తూ, 5 లక్షల నుంచి 7.5 లక్షల వరకు 20% పన్ను ఉండగా, 10%కి తగ్గించారన్నారు. బ్యాంకు డిపాజిట్ బీమాను లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు పెంచారన్నారు. ఈ బడ్జెట్ పూర్తి స్థాయి దేశ అభివృద్ధికి దోహదపడేలా పద్దులు కేటాయించడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు, కౌన్సిలర్లు దొడ్డి శ్రీనివాస్, మ్యాదరబోయిన వేణు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :ఎందుకు ఇంకా పూర్తి చేయలేదు: మంత్రి ప్రశాంత్ రెడ్డి