తెలంగాణ

telangana

ETV Bharat / state

rs praveen kumar: ఆ నిధులన్నీ హుజూరాబాద్ ఉప ఎన్నికకే మళ్లిస్తున్నారు! - కేసీఆర్​ కుటుంబంపై ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ కామెంట్లు

తెలంగాణ ప్రజలు మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ (rs praveen kumar) అన్నారు. సోమవారం సిద్దిపేట బార్‌ అసోసియేషన్‌ భవనంలో నిర్వహించిన సమావేశంలో బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు రాంజీగౌతమ్‌, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్‌లతో కలిసి మాట్లాడారు. కేసీఆర్ కుటుంబ ఆస్తులను జాతీయం చేయాలని డిమాండ్ చేశారు.

bsp-state-coordinator-rs-praveen-kumar-comments-on-cm-kcr-family
bsp-state-coordinator-rs-praveen-kumar-comments-on-cm-kcr-family

By

Published : Sep 28, 2021, 10:58 AM IST

తెలంగాణ ప్రజలు మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని.. భూమి, భుక్తి, విముక్తి, హక్కుల సాధనకు ముందడుగు వేయాలని మాజీ ఐపీఎస్‌ అధికారి, బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ (rs praveen kumar) అన్నారు. కేసీఆర్‌ కుటుంబ ఆస్తులను జాతీయం చేయాలని డిమాండ్‌ చేశారు. సోమవారం సిద్దిపేట బార్‌ అసోసియేషన్‌ భవనంలో నిర్వహించిన సమావేశంలో బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు రాంజీగౌతమ్‌, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్‌లతో కలిసి మాట్లాడారు.

తెరాస తెలంగాణ రావుల సమితిగా మారిందని, పేదల పాలిట రాబంధుల సమితిగా మారుతోందని మంద ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు. ఏడేళ్లుగా దళితుల సంక్షేమానికి కేటాయించిన నిధులను దారి మళ్లించి హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చూడండి:RSP on White Challenge :'బ్లాక్ అండ్ వైట్ ఛాలెంజీలు తన్నులాటలు, పరువు నష్టాల క్లైమాక్స్​కు వచ్చాయి'

ABOUT THE AUTHOR

...view details