BRS BJP Clash at Siddipet Train Inauguration :సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ మొట్టమొదటి రైలును నిజామాబాద్‌లో ప్రధాని మోదీ వర్చువల్‌గా.. సిద్దిపేట నుంచి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. అదే రైలులో మంత్రి హరీశ్‌రావు, బీజేపీ ఎమ్మల్యే రఘునందన్‌రావు బయలుదేరారు. హరీశ్ రావు దుద్దెడ వరకు ప్రయాణించగా.. రఘునందన్‌రావు గజ్వేల్ వరకు వెళ్లారు. అంతకుముందు ప్రారంభోత్సవ సమయంలో.. బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు సిద్దిపేట రైల్వేస్టేషన్‌కు ప్లకార్టులు, జెండాలు చేతబూని భారీగా తరలివచ్చారు.
Siddipet Secunderabad Inauguration 2023 :రైలు మార్గం ఘనత తమదంటే తమదంటూ నినదించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకానొక దశలో జెండా కర్రలు, కుర్చీలతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. మోదీ ఫొటోలతో కూడిన ప్లెక్సీలను బీఆర్ఎస్ కార్యకర్తలు చించేశారు. మరోవైపు కేసీఆర్ ఫొటో లేదని మండిపడుతూ మంత్రి హరీశ్‌రావు.. మోదీ ఫొటోలున్న ఎల్ఈడీ తెరలను పక్కన పెట్టించారు. భారీగా మోహరించిన పోలీసులు.. ఇరువర్గీయులను చెదరగొట్టారు. సుమారు రెండున్నర గంటలపాటు నెలకొన్న ఘర్షణ వాతావరణం రైలు వెళ్లిపోయాక సద్దుమణిగింది.
Harish Rao on Siddipet Railway Station Opening: కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వేలైన్(Kothapalli- Manoharabad Railway Line) నిర్మాణంలో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.640కోట్లు వెచ్చించిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. భూసేకరణ, ఇతర పనులన్నీ చేసి కేంద్రానికి సహకరిస్తే.. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కనీసం సీఎం కేసీఆర్ ఫొటో పెట్టకపోవడం శోచనీయచమని హరీశ్‌రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటు, ప్రాజెక్టుల నిర్మాణం, రైలు కల సాకారం.. ఇలా అన్నీ బీఆర్ఎస్ ఘనతేనని స్పష్టం చేశారు.