సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతరలో అపశృతి చోటు చేసుకుంది. బావపై బావమరుదులు కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది.
బావను కత్తితో పొడిచిన బావమరుదులు - అక్కన్నపేటలో దారుణం
అక్కను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మరదలిని మనువాడాడు. ఇదంతా నచ్చని బావమరుదులు పగ పెంచుకున్నారు. జాతరలో కత్తితో పోటుమీద పోటు పొడిచారు.
బావను కత్తితో పొడిచిన బావమరుదులు
తాడూరి యాదగిరి అనే వ్యక్తి తమ చెల్లిని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో బావ మరుదులైన శ్రీకాంత్, శ్రీనివాస్ దాడి చేశారు. గతంలో యాదగిరి తమ అక్కని పెళ్లి చేసుకోగా... నాలుగు నెలల క్రితం తమ చెల్లిని పెళ్లి చేసుకున్నాడని కత్తితో దాడి చేశారు.
కత్తిపోట్లకు గురైన వ్యక్తిని హుస్నాబాద్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.