తెలంగాణ

telangana

ETV Bharat / state

కొండ పోచమ్మ అమ్మవారికి తొలి బోనంగా 101 బోనాలు - బోనాలు తాజా వార్తలు

తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కొండ పోచమ్మ దేవాలయంలో అమ్మవారికి తొలి బోనంగా 101 బోనాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో బోనాలతో అమ్మవారికి జాతర నిర్వహించారు.

bonalu at kondapochamma temple
కొండ పోచమ్మ అమ్మవారికి తొలి బోనంగా 101 బోనాలు

By

Published : Dec 6, 2020, 1:16 PM IST

సిద్దిపేట జిల్లా జగదేవ్​పూర్ మండలంలోని తిగుల్ నర్సాపూర్ గ్రామంలోని శ్రీ కొండ పోచమ్మ అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో జాతర నిర్వహించారు. తొలి బోనంగా 101 బోనాలను అమ్మవారికి సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారికి సామూహికంగా బోనాల జాతర నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎంబీసీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర కుమ్మరి సంఘం నేతలు, జిల్లా నేతలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'అంబేడ్కర్​ కలలు కన్న దేశాన్ని నిర్మిస్తాం'

ABOUT THE AUTHOR

...view details