భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో పర్యటించారు. అనారోగ్యంతో బాధపడుతున్న, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న భాజపా నాయకులను పరామర్శించారు.
మీకు అండగా మేం ఉన్నాం: భాజపా రాష్ట్ర కార్యదర్శి - BJP telangana state secretary raghunandan rao visit to siddipet
అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భాజపా నాయకుల కుటుంబాలను ఆదుకుంటామని భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు.
భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు
బల్వంతపూర్లో భాజపా నేత చిట్యాల గోపాల్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని, అతణ్ని పరామర్శించారు. వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ధర్మాజీపేటలో భాజపా నాయకులను, వారి కుటుంబాలను కలిసి పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
TAGGED:
భాజపా రాష్ట్ర కార్యదర్శి