తెలంగాణ

telangana

ETV Bharat / state

'నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి' - mp bandi sanjay about farmers

అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యంతో పాటు పంట నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు.

mp sanjay visit to koheda
నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి

By

Published : Apr 21, 2020, 12:07 PM IST

2018-19 సంవత్సరంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన వరి ధాన్యం వివరాలను బహిర్గతం చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వేంకటేశ్వర్లపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.

రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులపై చర్చించకపోవడం బాధాకరమని సంజయ్ వాపోయారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించి
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details