సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో భాజపా నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నూతన సచివాలయ నిర్మాణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎర్రమంజిల్‌లో ఉన్న చారిత్రక కట్టడాలను కాపాడాలని కోరారు. ప్రస్తుత సచివాలయ భవనాలు పూర్తిగా నాణ్యతతో ఉన్నాయని వాస్తు పేరుతో వాటిని కూల్చివేయటం అనాగరికమని వెల్లడించారు. వేల కోట్ల ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారని సీఎంను ప్రశ్నించారు.
ప్రజాధనం దుర్వినియోగం చేయడం న్యాయమా?: భాజపా - ప్రజాధనం దుర్వినియోగం
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన సచివాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో భాజపా నాయకులు రాస్తారోకో నిర్వహించారు. వెంటనే నిర్ణయం ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ప్రజాధనం దుర్వినియోగం అవసరమా?: భాజపా
TAGGED:
ప్రజాధనం దుర్వినియోగం