భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి, తొగుట మండలాల్లో పర్యటించారు. మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామంలో ఇటీవల మృతి చెందిన మాడుగుల రాములు, తొగుట మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన జంగిడి యాదవ్వ కుటుంబాలను ఆయన పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. తన వంతుగా ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలను పరామర్శించిన రఘునందన్ రావు! - దుబ్బాక నియోజకవర్గం
సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు పర్యటించారు. తొగుట, మిరుదొడ్డి మండలాల పరిధిలోని రుద్రారం, రాంపూర్ గ్రామాల్లో ఇటీవల మరణించిన మాడుగుల రాములు, జంగిడి యాదవ్వల కుటుంబాలను పరామర్శించి.. వారికి ధైర్యం చెప్పారు.
మృతుల కుటుంబాలను పరామర్శించిన రఘునందన్ రావు!