సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని గువ్వలేగి, ఉప్పరపల్లి గ్రామాల్లో భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు.
'తెగించి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు ఏమయ్యాయి' - సిద్దిపేట జిల్లాలో భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు పర్యటన
సిద్దిపేట జిల్లాలో భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు పర్యటించారు. గ్రామాల్లో భాజపా జెండాను ఆవిష్కరించారు. తెగించి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
'తెగించి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు ఏమయ్యాయి'
అనంతరం రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు వివిధ పార్టీలకు చెందిన పలువురికి భాజపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితం... తెగించి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇదీ చదవండి :కేటీఆర్ అబద్ధాలు చెప్పుడు మానాలి : ఎంపీ అర్వింద్