తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎవరెన్ని కుట్రలు చేసిన భాజపా గెలుపు ఖాయం'

దుబ్బాక కేంద్రంగా ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని దుయ్యబట్టారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. ఎవరెన్ని కుట్రలు చేసినా భాజపా గెలుపు ఖాయమన్నారు.

'ఎవరెన్ని కుట్రలు చేసిన భాజపా గెలుపు ఖాయం'
'ఎవరెన్ని కుట్రలు చేసిన భాజపా గెలుపు ఖాయం'

By

Published : Nov 3, 2020, 4:58 AM IST

ఓటమి భయంతో తెరాస అడ్డదారుల్లో గెలవాలని చూస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రజాబలం లేకపోయినా... పైస బలంతో ఎలాగైనా నెగ్గాలని చూస్తోందన్నారు. దొంగలకు సద్దులు మోసిన అనుభవంతో తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు సంచులు మోస్తున్నారని విమర్శించారు.

విచ్చలవిడిగా నోట్ల కట్టలతో ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికార దుర్వినియోగం చేస్తుంటే పోలీస్ యంత్రాంగం నిద్రమత్తులో ఉందా అని ప్రశ్నించారు. భాజపా కార్యకర్తలపై దాడి చేసిన వారిని, డబ్బులు పంపిణీ చేస్తున్న వారిని తక్షణమే అరెస్టు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. దుబ్బాక కేంద్రంగా ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని దుయ్యబట్టారు. ఎవరెన్ని కుట్రలు చేసినా భాజపా గెలుపు ఖాయమన్నారు.

ఇదీ చూడండి:దుబ్బాక ఉప ఎన్నికకు సర్వం సిద్ధం.. ఉదయం 7 గంటలకు పోలింగ్​

ABOUT THE AUTHOR

...view details