కులాలను అడ్డుపెట్టుకొని మంత్రి పదవి సాధించి... కులాలను నట్టేట ముంచి కేసీఆర్ దగ్గర మోకరిల్లే పరిస్థితి తెలంగాణ మంత్రులదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా దౌల్తాబాద్‌లో ఏర్పాటు చేసిన గొల్ల కురుమల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గొల్ల కుర్మలకు గొర్లు ఇచ్చి గొర్ల కాపర్లుగానే ఉండాలనే కుట్ర పన్నారని ఆరోపించారు.
బీసీలను నట్టేట ముంచిన ముఖ్యమంత్రి కేసీఆర్: బండి - దుబ్బాక ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్
కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ పంపుసెట్ల వద్ద మీటర్లు పెట్టే ఆలోచన కేంద్రానికి లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆ ఆలోచనతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెడితే మీ సంగతి తేలుస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
బీసీలను నట్టేట ముంచిన ముఖ్యమంత్రి కేసీఆర్: బండి
అవినీతిపరుడిని తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు దేశమే ప్రశ్నిస్తుంటే... రాష్ట్ర ప్రజలు తలదించుకోవాల్సి వస్తోందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీసీలను నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రమంతా దుబ్బాక వైపు చూస్తుందని... భాజపా అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:ధరణి.. భారతదేశానికే ట్రెండ్ సెట్టర్: సీఎం కేసీఆర్