ఉద్యోగుల పీఆర్సీ 7.5 ఫిట్మెంట్, నిరుద్యోగ భృతి, పెన్షన్ దారుల హక్కులకు వారికి మద్దతుగా భాజపా జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. భాజపా పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. వారిని అడ్డుకోటంతో పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది.
సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుకు వ్యతిరేకంగా భాజపా నాయకులు నినాదాలు చేశారు. కలెక్టర్ కార్యాలయం లోపలికి చొచ్చుకెల్లేందుకు ప్రయత్నించిన నాయకులను అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు.