రాష్ట్రంలో దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ... భాజపా ఆధ్వర్యంలో సూర్యాపట జిల్లా తుంగతుర్తి, మోత్కూరు తహశీల్దార్ కార్యాలయాల ఎదుట దీక్షలు చేశారు. సిద్ధిపేట జిల్లాలో దళిత బిడ్డ నర్సింలు ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపించారు.
దళితులపై దాడులను నిరసిస్తూ.. భాజపా ఆధ్వర్యంలో ధర్నాలు - bjp protest at tungaturthi mro office for attacks on dalit
సిద్ధిపేట జిల్లాలో దళిత బిడ్డ నర్సింలు ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని భాజపా నాయకులు ఆరోపించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు తహసీల్దార్ కార్యాలయాల ముందు ఆ పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
దళితులపై దాడులను నిరసిస్తూ.. భాజపా ఆధ్వర్యంలో ధర్నాలు
నర్సింలు కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం, మూడు ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కమలం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
ఇవీచూడండి:పోరాడైనా కృష్ణా, గోదావరి జలాలను దక్కించుకుంటాం: కేసీఆర్