దుబ్బాక ఉపఎన్నికల్లో ఓటమి భయంతోనే భాజపా కార్యకర్తలు, నాయకులపైన.. తెరాస ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయిస్తోందని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి.. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్టు చేయించిందని మండిపడ్డారు.
దుబ్బాకలో ఓటమి భయంతోనే దాడులు: లక్ష్మణ్
ప్రభుత్వ పనితీరును ప్రజలముందుంచి ఓట్లు అడగాలని.. అధికారం అడ్డం పెట్టుకొని గెలవాలనుకోవడం సరైంది కాదని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ సూచించారు. దుబ్బాకలో ఓటమి భయంతోనే పోలీసులతో దాడులు చేయిస్తోందని విమర్శించారు.
దుబ్బాకలో ఓటమి భయంతోనే దాడులు: లక్ష్మణ్
అధికార పార్టీ నేతల ఒత్తిడికి పోలీసులు తలొగ్గడం సరైంది కాదని లక్ష్మణ్ సూచించారు. అధికారం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వ పనితీరును ప్రజల ముందుంచి ఓట్లడగాలని.. అధికారాన్ని అడ్డంపెట్టుకొని గెలవాలని తెరాస భావిస్తే ప్రజలు సహించరన్నారు.
ఇవీచూడండి:దుబ్బాకలో భాజపా గెలవబోతోంది: బండి సంజయ్