దుబ్బాకలో భాజపా సభ్యత్వ నమోదు ప్రారంభం - bjp membership drive
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్‌రావు అన్నారు. దుబ్బాకలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
దుబ్బాకలో భాజపా సభ్యత్వ నమోదు ప్రారంభం
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్ రావు ప్రారంభించారు. దుబ్బాక మున్సిపాలిటీలో భాజపాను గెలిపించాలని కోరారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇంటింటికీ తిరుగుతూ సభ్యత్వాలు నమోదు చేయించారు.