భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రహదారిపై బైఠాయించి ఆ పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
హుస్నాబాద్‌లో పోలీసులు, భాజపా నేతలకు మధ్య తోపులాట..
భాజపా రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్‌పై జరిగిన దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
హుస్నాబాద్‌లో పోలీసులు, భాజపా నేతలకు మధ్య తోపులాట..
పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈక్రమంలో పోలీసులకు భాజపా నాయకులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. అదేవిధంగా కోహెడ, అక్కన్నపేట మండలాల్లో కూడా భాజపా కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
ఇదీ చూడండి:దీక్ష కొనసాగిస్తున్న బండి సంజయ్.. ప్రగతిభవన్ వద్ద భారీగా బలగాలు