తెలంగాణ

telangana

ETV Bharat / state

తహసీల్దార్ కార్యాలయల ఎదుట భాజపా ధర్నా - భాజపా కార్యకర్తల ఆందోళన

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల తహసీల్దార్ కార్యాలయాల ఎదుట భాజపా నాయకులు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో రోజూ ఎక్కడో ఒక చోట దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయని ఆరోపించారు.

తహసీల్దార్ కార్యాలయల ఎదుట భాజపా ధర్నా
తహసీల్దార్ కార్యాలయల ఎదుట భాజపా ధర్నా

By

Published : Jul 31, 2020, 4:38 PM IST

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల తహసీల్దార్ కార్యాలయాల ఎదుట భాజపా నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం రాష్ట్రంలో దళితులపై దాడులను, అణచివేత విధానాన్ని అనుసరిస్తోందని తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దళితులకు ఉచితంగా 3 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తానన్న సీఎం... ఉన్న భూమిని కూడా లాక్కోవాలని ప్రయత్నించడం దారుణమన్నారు.

రాష్ట్రంలో రోజూ ఎక్కడో ఒక చోట దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయని ఆరోపించారు. బాధితులను ఓదార్చి అండగా ఉండే ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి భాజపా నాయకులను అడ్డుకోవడం చేస్తోందన్నారు. ఆత్మహత్య చేసుకున్న దళిత రైతు కుటుంబానికి రూ. కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details