సిద్దిపేట జిల్లా అక్కన్నపేట ఎమ్మార్వో కార్యాలయం ఎదుట భాజపా నాయకులు ధర్నా నిర్వహించారు. అక్కన్నపేట మండలానికి పూర్తిస్థాయి తహసీల్దార్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. అధికారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎమ్మార్వో కార్యాలయం వద్ద భాజపా కార్యకర్తల ధర్నా - bjp leaders protest at akkannapeta
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలానికి పూర్తిస్థాయి తహసీల్దార్‌ను నియమించాలంటూ భాజపా కార్యకర్తలు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

ఎమ్మార్వో కార్యాలయం వద్ద భాజపా కార్యకర్తల ధర్నా
మండలం కొత్తగా ఏర్పడటం వల్ల భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని.. తరచూ తహసీల్దార్ల బదిలీతో సమస్యలు పరిష్కారమవ్వట్లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పూర్తిస్థాయి తహసీల్దార్‌ను నియమించాలని కోరారు.
ఎమ్మార్వో కార్యాలయం వద్ద భాజపా కార్యకర్తల ధర్నా
ఇదీ చదవండిః రామోజీరావుకు గ్రీన్ ఛాలెంజ్ విసిరిన మంత్రి ఎర్రబెల్లి