నూతన వ్యవసాయ చట్టాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీ చిత్రపటానికి భాజపా నాయకులు పాలాభిషేకం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో పాలాభిషేకం చేశారు. రైతే రాజు కావాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ చట్టాలు చేసిందని... తమ రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నాయని పట్టణ భాజపా అధ్యక్షుడు శంకర్ బాబు ఆరోపించారు. సన్నపు రకం వరి ధాన్యాన్ని పండించిన రైతులకు రూ.2,500 మద్దతు ధరను చెల్లించలేని ప్రభుత్వం... భారత్ బంద్‌లో పాల్గొనడం గమనార్హమన్నారు.
హుస్నాబాద్‌లో ప్రధాని మోదీకి పాలాభిషేకం - సిద్దిపేట జిల్లా వార్తల
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలు రైతుల శ్రేయస్సు కోసమేనని భాజపా శ్రేణులు తెలిపాయి. డిసెంబర్ 8నాటి భారత్ బంద్‌లో రైతులెవరూ పాల్గొనలేదని పట్టణ భాజపా అధ్యక్షుడు శంకర్ బాబు అన్నారు.
హుస్నాబాద్‌లో ప్రధాని మోదీకి పాలాభిషేకం
భారత్ బంద్‌లో ఎక్కడా రైతులు పాల్గొనలేదని, కేవలం రాజకీయ నాయకులు మాత్రమే పాల్గొన్నారని అన్నారు. మోదీ రైతుల పక్షపాతి అని... అన్నదాత అభివృద్ధికి కేంద్రం ఎంతో కృషి చేస్తోందని అన్నారు. నూతన చట్టాలకు రైతులు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:సిరిసిల్ల ఆసుపత్రిలో నూతన సదుపాయాలు ప్రారంభించిన కేటీఆర్