సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేటలో భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్‌రావు పర్యటించారు. గ్రామంలో భాజపా జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో కలియతిరుగుతూ గ్రామ ప్రజల సాధకబాధకాలను ఆత్మీయ పలకరింపుతో తెలుసుకున్నారు. గ్రామంలోని సీనియర్ నాయకులు,యువకులు రఘునందన్ రావు సమక్షంలో పార్టీలో చేరారు.
'నిర్వాసితులందరికీ సమానంగా పరిహారం ఇవ్వాలి' - toguta news
సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేటలో భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్‌రావు పర్యటించారు. గ్రామ ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని పలువురు యువకులు పార్టీలో చేరారు.
!['నిర్వాసితులందరికీ సమానంగా పరిహారం ఇవ్వాలి' bjp leader ragunandan rao visited in ellareddypet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8690327-901-8690327-1599303922999.jpg)
bjp leader ragunandan rao visited in ellareddypet
ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు, కాలువలకు భాజపా వ్యతిరేకం కాదని రఘనందన్‌రావు తెలిపారు. భూమిని కోల్పోయిన నిర్వాసితులకు అందరికీ సమానంగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ భాజపా నాయకులు, కార్యకర్తలు, గ్రామ యువకులు పాల్గొన్నారు.