సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లిలో భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు ప్రచారం నిర్వహించారు. గతంలో రూ. 80 వేలకు తీసుకున్న ప్లాటుకు లక్షన్నర ఎల్ఆర్ఎస్ కట్టమని ప్రభుత్వం చెబుతోందని రఘనందన్ మండిపడ్డారు. అనాలోచిన నిర్ణయాలతో ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నారని విమర్శించారు.
'రూ. 80 వేల ప్లాట్‌కు లక్షన్నర ఎల్ఆర్ఎస్ కట్టాలటా...!' - dubbaka election updates
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లిలో భాజపా ప్రచారం నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వంపై పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మందు, విందులతో జనాలను మభ్యపెడుతున్నారని రఘునందన్ ఆరోపించారు.
bjp leader raghunadhanrao campaign for mla by elections
ఎన్నడూలేని విధంగా మంత్రి హరీశ్ రావు... జనాలకు మందు, విందు ఇస్తూ మభ్యుపెడుతున్నారని ఆరోపించారు. కుల సంఘాలు కట్టుకోండంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.