తెలంగాణ యావత్తు హుజూరాబాద్ వైపు చూస్తోందని భాజపా నేత ఈటల రాజేందర్ తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో ఈటల పాల్గొన్నారు. హుజూరాబాద్‌లో ఐదు నెలలుగా డా.అంబేడ్కర్ రచించిన రాజ్యాంగానికి బదులు.. కేసీఆర్ రాసుకున్న రాజ్యాంగం అమలవుతోంది. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఒక ఉపఎన్నిక కోసం ఇన్ని వేల కోట్ల జీవోలు ఇచ్చి, ఇన్ని రకాల ప్రలోభాలకు గురి చేయటం ఇదే మొదటిసారని ధ్వజమెత్తారు.
ధర్మమే గెలుస్తుంది..
"ఒక్కడి ముఖం అసెంబ్లీలో కనిపించకుండా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేస్తే.. ఆయన బానిసలు చాలా మంది వాటిని అమలు చేస్తున్నారు. మద్యం ఏరులై పారుతోంది. వందల కోట్లతో మనుషులకు విలువకట్టే ప్రక్రియ కొనసాగుతోంది. అక్టోబర్ 30న హుజూరాబాద్‌లో కురుక్షేత్ర యుద్ధం చివరి దశ. ఈ యుద్ధం కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి జరుగుతోంది. ఈ యుద్ధంలో ధర్మమే గెలుస్తుంది. ప్రజలే గెలుస్తారు. పద్దెనిమిదేళ్లలో ఉద్యమకారునిగా, ఎమ్మెల్యేగా, ఫ్లోర్ లీడర్‌గా, మంత్రిగా రాష్ట్రానికి చేసిన సేవ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోతుంది. దాన్ని చెరిపేసే సత్తా.. కేసీఆర్‌కే కాదు.. ఆయన జేజమ్మ వాళ్ల కూడా కాదు."- ఈటల రాజేందర్, హుజూరాబాద్ భాజపా అభ్యర్థి
'కేసీఆరే కాదు.. ఆయన జేజమ్మ వచ్చినా నన్ను ఓడించలేరు' ఇదీ చూడండి: