సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట భాజపా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి, వరి, మొక్కజొన్న, మిర్చి పంట పొలాలు బాగా దెబ్బతిన్నాయని భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమలాకర్ రెడ్డి తెలిపారు.
నష్టపోయిన రైతులను ఆదుకోవాలని భాజపా కిసాన్ మోర్చా ధర్నా - siddipet news
వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భాజపా కిసాన్ మోర్చా నాయకులు సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులకు పరిహారం అందివ్వాలని డిమాండ్ చేశారు.
నష్టపోయిన రైతులను ఆదుకోవాలని భాజపా కిసాన్ మోర్చా ధర్నా
వరదలకు రైతులు విపరీతంగా నష్టపోయారని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన పంట పొలాలను గుర్తించి రైతులకు పరిహారం అందివ్వాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: 'సాగునీటి కల్పనపై జీవన్‌రెడ్డి వ్యాఖ్యలు అవాస్తవం'
Last Updated : Aug 28, 2020, 7:40 PM IST