సన్నరకం వడ్లకు రూ.2500 మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట పట్టణ కిసాన్ మోర్చా నాయకులు ధర్నా నిర్వహించారు. వర్షాకాలంలో సన్నవడ్లు పండించమని.. లేకపోతే రైతుబంధు పథకం వర్తించదని రైతులను తెరాస ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేసిందని కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడు వేల్పుల నాగార్జున్ ఆరోపించారు. తీరా.. సన్నరకం వడ్లు పండించిన తరువాత మద్దతు ధర ఇవ్వకుండా ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు.
'పంట వేసేదాకా భయపెట్టి.. వేశాక నట్టేట ముంచారు' - హుస్నాబాద్‌లో కిసాన్‌మోర్చ నాయకుల ధర్నా
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట పట్టణ కిసాన్ మోర్చా నాయకులు ధర్నా నిర్వహించారు. సన్నరకం వడ్లకు రూ.2500 మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు కూడా రైతుబంధు ప్రకటించాలని... రుణమాఫీ చేయాలని భాజపా కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఫసల్ భీమా యోజనా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకపోవటం వల్ల అతివృష్టితో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందకుండా పోయిందన్నారు. కౌలు రైతులకు కూడా రైతుబంధు ప్రకటించాలని.. రుణమాఫీ చేయాలని భాజపా కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ పట్టణ భాజపా అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు, కౌన్సిలర్ మ్యాదరబోయిన వేణు యాదవ్, జిల్లా కోశాధికారి దొడ్డి శ్రీనివాస్, ఎంపీటీసీ బాణాల జయాలక్ష్మి, మండలాధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు కాదాసు దీపిక, తదితరులు పాల్గొన్నారు.