'గాంధీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ యాత్ర'
మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా సిద్దిపేటలో గాంధీ సంకల్ప యాత్రను భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు ప్రారంభించారు.
గాంధీ సంకల్ప యాత్ర 2019
గాంధీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే గాంధీ సంకల్ప యాత్రను చేపట్టామని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు అన్నారు. సిద్దిపేటలో ఈ యాత్రను ప్రారంభించారు. మూడ్రోజుల పాటు సిద్దిపేట, దుబ్బాక, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాలలో పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. యువకులు దురలవాట్లకు బానిసలు కావొద్దని సూచించారు. అధికారంలోకి వచ్చాక.. ప్రధాని మోదీ అంచెలంచెలుగా అవినీతి, పేదరిక నిర్మూలన చేస్తూ భారతదేశ దిశను మార్చేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు.
- ఇదీ చూడండి : బోటును ఒడ్డుకు చేర్చేందుకు.. ఏం చేశారంటే..!