సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ కాలువ తెగిపోయి నీట మునిగిన గ్రామాన్ని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి విజయరామారావుతోపాటు భాజపా నేత లక్ష్మీనారాయణ సందర్శించారు.
జలాశయానికి పడిన గండిని చూస్తే... కాంట్రాక్టర్లతో కలిసి కేసీఆర్ రాష్ట్ర ఖజానాకు గండి పెట్టారని మాజీ ఎంపీ వివేక్ ఆరోపించారు. రాష్ట్రంలో నా కంటే గొప్ప ఇంజనీర్ లేరన్న కేసీఆర్... ఈ గండికి సమాధానం చెప్పాలని భాజపా అధికార ప్రతినిధి రఘునందన్ డిమాండ్ చేశారు.