తెలంగాణ

telangana

ETV Bharat / state

జీవో 203 రద్దు చేయాల్సిందే: భాజపా

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో భాజపా కార్యకర్తలు మౌన దీక్ష నిర్వహించారు. జగన్​ సర్కార్​ విడుదల చేసిన జీవో 203ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

BJP  Demand for cancel  GO 203  Mouna Dhiksha in Siddipeta district
జీవో 203 రద్దు చేయాల్సిందే

By

Published : May 16, 2020, 2:46 PM IST

భాజపా రాష్ట్ర అధిష్ఠానం పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో కార్యకర్తలు మౌన దీక్ష చేపట్టారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 203ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుంచి కృష్ణా నది జలాలను తరలించడం వల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదముందని పేర్కొన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ ఏపీ సర్కార్​పై ఒత్తిడి తీసుకొని రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాజపా పట్టణ అధ్యక్షుడు శంకర్ బాబు, కౌన్సిలర్లు దొడ్డి శ్రీనివాస్, వేణు, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details