తెలంగాణ

telangana

ETV Bharat / state

కాషాయ జెండా ఆవిష్కరించిన భాజపా అభ్యర్థి రఘునందన్ రావు - దుబ్బాక భాజపా అభ్యర్థి రఘునందన్ రావు

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు కాషాయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామానికి చెందిన వందమందికిపైగా కార్యకర్తలు ఆయన సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.

కాషాయ జెండా ఆవిష్కరించిన భాజపా అభ్యర్థి రఘునందన్ రావు
కాషాయ జెండా ఆవిష్కరించిన భాజపా అభ్యర్థి రఘునందన్ రావు

By

Published : Sep 14, 2020, 1:02 PM IST

Updated : Sep 14, 2020, 1:54 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో కాషాయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రఘునందన్ సమక్షంలో గ్రామానికి చెందిన వందమందికిపైగా కార్యకర్తలు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.

కషాయ జెండా ఆవిష్కరించిన భాజపా అభ్యర్థి రఘునందన్ రావు

వాటిలా ఎందుకు అభివృద్ధి చేయలేదు..

దుబ్బాక నియోజక వర్గం వెనుకబడి ఉందని భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు అన్నారు. దుబ్బాక పక్కనే ఉన్న సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలు అభివృద్ధి చేసినట్లు దుబ్బాకని ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. దుబ్బాకలో ప్రజలు ఈసారి వారసత్వ రాజకీయాలకు కాకుండా భాజపాకు అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో దుబ్బాక మండల భాజపా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : రెవెన్యూ సంస్కరణలు ప్రజలు ఉపయోగపడేలా ఉండాలి: వీహెచ్

Last Updated : Sep 14, 2020, 1:54 PM IST

ABOUT THE AUTHOR

...view details