తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్ని కుట్రలు చేసినా భాజపాదే విజయం: రఘునందన్‌ రావు - దుబ్బాకలో భాజపా ప్రెస్‌మీట్‌

వాహన తనిఖీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగత వేధింపులకు గురి చేస్తోందని భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్‌ రావు ఆరోపించారు. 200 మంది పోలీసులతో తనిఖీ చేపడుతూ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాకలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ప్రభుత్వంపై రఘునందన్‌ విమర్శలు గుప్పించారు.

bjp candidate raghunandan press meet in debbaka
ఎన్ని కుట్రలు చేసినా భాజపాదే గెలుపు: రఘునందన్‌ రావు

By

Published : Oct 20, 2020, 3:56 PM IST

Updated : Oct 20, 2020, 5:35 PM IST

వాహన తనిఖీ పేరుతో భాజపాని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్‌ చేసిందని ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్‌ రావు ఆరోపించారు. అర్థరాత్రి వేళ సుమారు 200 మంది పోలీసులతో మంత్రి హరీశ్‌రావు వాహన తనిఖీ చేయించారని, ఇదంతా కుట్ర పూరిత వ్యవహారమని ఆక్షేపించారు. తెరాస ఎన్ని కుట్రలు పన్నినా దుబ్బాకలో విజయం తమదే అని ధీమా వ్యక్తం చేశారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాకలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో ఆయన ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు.

ఎన్ని కుట్రలు చేసినా భాజపాదే గెలుపు: రఘునందన్‌ రావు

'తప్పుడు సమాచారంతో సుమారు 8 గంటల పాటు పోలీసులు తనిఖీ పేరుతో హైడ్రామా చూపించారు. పోలీసులను వివరణ కోరితే సరైన సమాధానం కూడా చెప్పలేదు. మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. మంత్రి హరీశ్‌ రావు ఎన్ని కుట్రలు చేసినా భాజపా ముందుంటుంది.'

రఘునందన్ రావు, దుబ్బాక భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి

తమపై తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తి ఎవరో వారిపై చర్యలు తీసుకోవాలని రఘునందన్ అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా.. ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదని అన్నారు. తమని వేధిస్తున్న తీరు, జరిగిన అన్ని సంఘటనలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.

శ్వేతపత్రం విడుదల చేయండి

2014 నుంచి ఇప్పటివరకూ దుబ్బాకకి ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో శ్వేత పత్రం విడుదల చేయాలని రఘునందన్‌ డిమాండ్‌ చేశారు. భాజపా గెలిచిన దగ్గర రూ. 2 పింఛను వస్తుందని హరీశ్‌ రావు ఎద్దేవా చేశారనీ, అది నిజమైతే నిరూపించాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్, తెరాస ఒక నాణేనికి బొమ్మా బొరుసు లాంటివని అన్నారు.

ఇదీ చదవండి:బొగ్గుగనిలో ప్రమాదం- నలుగురు మృతి

Last Updated : Oct 20, 2020, 5:35 PM IST

ABOUT THE AUTHOR

...view details