తెలంగాణ

telangana

ETV Bharat / state

దుబ్బాకలో గెలుపు కోసం.. భాజపా ముమ్మర ప్రచారం - BJP Campaign In Dubbaka by elections

దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు కోసం భాజపా ముమ్మర ప్రచారం చేస్తోంది. పార్టీ నుంచి టికెట్​ ఆశిస్తున్న రఘునందన్​ రావు దుబ్బాక నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటించి భాజపాను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తెరాస పాలనలో దుబ్బాకలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు.

BJP  Campaign In Dubbaka by elections
దుబ్బాకలో గెలుపు కోసం.. భాజపా ముమ్మర ప్రచారం

By

Published : Oct 3, 2020, 8:42 PM IST

దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజపా గెలుపు కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ఎలాగైనా దుబ్బాకలో పాగా వేయాలని ఎత్తులు వేస్తున్నది. ఆ స్థానం నుంచి టికెట్​ ఆశిస్తున్న రఘునందన్​ రావు ఇప్పటికే.. ప్రచారం ముమ్మరం చేశారు. నియోజకవర్గంలోని రాయపోల్​ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించి ఉప ఎన్నికల్లో భాజపాను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ఆరేళ్ల తెరాస పాలనలో నియోజక వర్గంలో జరిగిన అభివృద్ధి ఏమిటో ఈ ప్రాంత ప్రజలకు తెలియజేయాాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుబ్బాక అభివృద్ధిని పట్టించుకోని మంత్రి హరీష్​రావు ఎన్నికల్లో ఓట్ల కోసం ఈ ప్రాంత ప్రజల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం తానే ఇస్తున్నట్టు ప్రచారం చేస్తుందని, తెరాస నేతలు అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారని రఘునందన్​రావు విమర్శించారు. పేదల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారని.. ఎన్నికల్లో భాజపా గెలుపును ఎవరూ ఆపలేరని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవీ చూడండి:యూపీలో మైనర్​ అపహరణ, సామూహిక అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details