సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికల్లో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు.. తన ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలో ద్విచక్రవాహన ర్యాలీను నిర్వహించారు. గులాబీ పార్టీకి ఓట్లు వేయకపోతే పింఛన్లు తొలగిస్తామని తెరాస శ్రేణులు తప్పుగా ప్రచారం చేస్తున్నారంటూ రఘునందన్‌రావు ఆరోపించారు.
జోరుగా భాజపా ప్రచారం.. దౌల్తాబాద్‌లో బైకు ర్యాలీ - దుబ్బాక ఉపఎన్నికలు లేటెస్ట్ వార్తలు
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి హరీశ్‌రావు అన్యాయం చేశారని దుబ్బాక భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు ఆరోపించారు. దౌల్తాబాద్ మండలకేంద్రంలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన బైకు ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
జోరుగా భాజపా ప్రచారం.. దౌల్తాబాద్‌లో బైకు ర్యాలీ
సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని.. మంత్రి హరీశ్‌రావు దుబ్బాకలో ఎందుకు చేయలేదంటూ రఘునందన్‌రావు ప్రశ్నించారు. ఉపఎన్నికల్లో భాజపాకు ఓటు వేసి గెలిపిస్తే.. దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండిఃదుబ్బాక ఉపఎన్నిక... 12 నామినేషన్ల తిరస్కరణ