సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో గణేశ్ మండపాల తొలగింపునకు నిరసనగా... ప్రభుత్వానికి వ్యతిరేకంగా భాజపా, వీహెచ్‌పీ నాయకులు నిరసన తెలిపారు. ముఖానికి నల్లటి మాస్కులు ధరించి, ప్లకార్టులు పట్టుకొని ఆందోళన చేపట్టారు. మండపాలు తొలగించాలని బెదిరిస్తున్న పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మైనారిటీలకు లేని ఆంక్షలు హిందువులకే ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు.
గణేశ్ మండపాల తొలగింపు నిరసిస్తూ ఆందోళన
గణేశ్ మండపాల తొలగింపును నిరసిస్తూ... సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో భాజపా, వీహెచ్‌పీ నాయకులు నిరసన తెలిపారు. ఇతర మతాలకు లేని ఆంక్షలు హిందువులపై ఎందుకని ప్రశ్నించారు.
గణేశ్ మండపాల తొలగింపునకు నిరసనగా ఆందోళన
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హిందూ పండుగలపై మమకారం తగ్గుతోందని నాయకులు ఆరోపించారు. కరోనా నేపథ్యంలో... నిబంధనల మేరకు ఉత్సవాలు జరిపిస్తామని తెలిపిన ప్రభుత్వం ఇప్పుడిలా వ్యవహరించడం సరికాదన్నారు. హిందుత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తెరాసకు పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో పండుగలపై ఆంక్షలు విధించకుండా నడుచుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి :విఫలమవడానికి గల కారణాలపై కమిటీ వేశాం : జెన్‌కో సీఎండీ