దుబ్బాక ఉపఎన్నికల్లో గతం కంటే ఎక్కువ మెజార్టీతో తెరాస విజయం సాధిస్తుందని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. వివిధ పార్టీల నాయకులకు కండువా కప్పి... పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామాల్లోకి ప్రచారానికి వెళ్తున్న కాంగ్రెస్ నేతలకు ప్రజల నుంచి ఆదరణ లభించడం లేదని మంత్రి విమర్శించారు. ఓట్లు అడిగేందుకు కూడా ప్రజలు వారిని దగ్గరికి రానివ్వట్లేదని వ్యాఖ్యానించారు.
'అప్పుడు మీరు చేస్తే ఒప్పు... ఇప్పుడు మేము చేస్తే తప్పా?'
దుబ్బాకలో గతంలో కంటే అధిక మెజార్టీతో తెరాస విజయం సాధిస్తోందని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలకు ప్రజల నుంచి ఆదరణ లభించడం లేదని వ్యాఖ్యానించారు.
'అప్పుడు మీరు చేస్తే ఒప్పు... ఇప్పుడు మేము చేస్తే తప్పా?'
కాంగ్రెస్ హయాంలో ఎల్ఆర్ఎస్ను తీసుకురాలేదా? అని ప్రశ్నించిన హరీశ్ ... ఉత్తమ్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెరాస సర్కార్ ఎన్నికల ప్రణాళికను నూటికి నూరుశాతం అమలుచేస్తోందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:దుబ్బాకలో ఊపందుకున్న ఉపఎన్నికల ప్రచారం