భోగి పండుగను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో అయ్యప్ప స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహమ్మారి అంతమై.. ఈ ఏడాది ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
హుస్నాబాద్‌లో ఘనంగా భోగి వేడుకలు
హుస్నాబాద్‌లో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. అయ్యప్ప స్వాములు భోగి మంటలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హుస్నాబాద్‌లో ఘనంగా భోగి వేడుకలు
పంటలు సమృద్ధిగా పండి, పశు సంపద అభివృద్ధి చెందాలని కోరుతూ.. స్వాములు ఉదయాన్నే భోగి మంటలతో వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ ఆకుల రజిత, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కూకట్‌పల్లిలో అంబరాన్నంటేలా భోగి వేడుకలు