బతుకమ్మ పండుగ సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని 15వార్డులోని ప్రజలకు బతుకమ్మ చీరలతోపాటు నిత్యావసర సరకులు కౌన్సిలర్ మర్రిపల్లి శ్రీనివాస్ గౌడ్ భవాని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు హాజరయ్యారు.
'ప్రతి ఇంట బతుకమ్మ కానుకతో ఆనందం నిండాలి' - సిద్దిపేటలో బతుకమ్మ చీరల పంపిణీ
బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఇంట ఆనందాలు నిండాలని బతుకమ్మకానుకను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని సిద్దిపేట మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు తెలిపారు. పట్టణంలోని 15వార్డు ప్రజలకు బతుకమ్మ చీరలతోపాటు నిత్యావసర వస్తువలను పంపిణీ చేశారు.
'ప్రతి ఇంట బతుకమ్మకానుకతో ఆనందాలు నిండాలి'
సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ భవాని తన సొంత డబ్బుతో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చాలా సంతోషకరం మున్సిపల్ ఛైర్మన్ అభినందించారు.
ఇదీ చేయండి:ఓఆర్‌ఆర్‌పై ట్రామా కేంద్రాలు, అంబులెన్స్‌ల ప్రారంభం