తెలంగాణ

telangana

ETV Bharat / state

ఊరూవాడ మూరుమోగేలా గజ్వేల్​లో బతుకమ్మ సంబురాలు - గజ్వేల్​లో బతుకమ్మ పండుగ సంబురాలు తాజా వార్త

బతుకమ్మ ఉత్సవాలను సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. పల్లె పట్టణం తేడా లేకుండా ప్రధాన వీధుల్లో సాయంత్రం వేళ ఆడపడుచులందరూ చేరి బతుకమ్మ సందడి నెలకొంది.

bathukamma festival celebrations at gajwel in siddipet
ఊరూవాడ మూరుమోగేలా గజ్వేల్​లో బతుకమ్మ సంబురాలు

By

Published : Oct 19, 2020, 12:28 PM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్​ నియోజకవర్గంలో ఊరువాడ అన్న తేడా లేకుండా ప్రతి వాడవాడలో బతుకమ్మ సందడి నెలకొంది. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు బతుకమ్మ పండుగను పిల్లలు ఘనంగా నిర్వహించారు.

రంగురంగుల పూలతో తయారు చేసిన బతుకమ్మను గ్రామ ప్రధాన వీధుల్లో ఉంచి దాని చుట్టూ లయబద్దంగా తిరుగుతూ పాటలు పాడారు. సాయంత్రం వేళల్లో బతుకమ్మలతో మహిళలు సందడి చేశారు. అనంతరం బతుకమ్మలను గ్రామ శివారులో ఉన్న చెరువులో నిమజ్జనం చేశారు.

ఇదీ చూడండి:రెండోరోజు అన్నపూర్ణగా శ్రీ భద్రకాళి అమ్మవారి దర్శనం

ABOUT THE AUTHOR

...view details