తెలంగాణ

telangana

ETV Bharat / state

పనికిమాలిన చర్యను మానుకోవాలి: బ్యాంకు ఉద్యోగులు - సిద్దిపేట జిల్లా వార్తలు

చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేయాలనే పనికిమాలిన చర్యను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని సిద్దిపేట బ్యాంకు ఉద్యోగులు నిరసన చేపట్టారు.

పనికిమాలిన చర్యను మానుకోవాలి: బ్యాంకు ఉద్యోగులు
పనికిమాలిన చర్యను మానుకోవాలి: బ్యాంకు ఉద్యోగులు

By

Published : Feb 1, 2020, 1:38 PM IST

పనికిమాలిన చర్యను మానుకోవాలి: బ్యాంకు ఉద్యోగులు

చిన్న బ్యాంకుల విలీనం చేస్తామంటున్న కేంద్ర ప్రభుత్వానిది పనికిమాలిన చర్య అని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ నాయకులు ఆరోపించారు. సిద్దిపేటలో ఎస్బీఐ బ్యాంకు ముందు బ్యాంకు ఉద్యోగుల నిరసన చేపట్టారు. సీఐటీయూ, జర్నలిస్టు సంఘం నాయకులు బ్యాంకు వారికి మద్దతు తెలిపారు.

బ్యాంకుల విలీనాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రజల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే బ్యాంకుల విలీన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాంకు ఉద్యోగులకు ఈ నెల 10న సవరణ చట్టం ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు.

ఇవీ చూడండి:తన ఆస్పత్రిని రూ.వంద స్కానింగ్​ సెంటర్​ అనేవారు: గవర్నర్​ తమిళిసై

ABOUT THE AUTHOR

...view details