దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్ ఏం చేశారో చర్చకు రావాలని భాజపా రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. దుబ్బాక ఉపఎన్నికలో భాజపా అభ్యర్థి రఘునందన్ రావు నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బండి సంజయ్, మాజీ ఎంపీ జితేందర్రెడ్డితో కలిసి రఘునందన్ రావు నామపత్రాలు సమర్పించారు. ఈ ఉపఎన్నిక రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం కావాలన్నారు. ఈ ర్యాలీ చూసి తెరాస, కాంగ్రెస్ మైండ్ బ్లాక్ కావాలన్నారు. దుబ్బాక అభివృద్ధి కోసం కేంద్రం కేటాయించిన రూ. 285.17 కోట్లు మంజూరు చేస్తే తెరాస నాయకులు దోచుకున్నారని మండిపడ్డారు. కేంద్రం నిధులు ఇవ్వలేదని నిరూపిస్తే... ఇదే చౌరస్తాలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమని ఉద్ఘాటించారు.
హరీశ్ రావు ఇప్పటికైనా రెండు కళ్ల సిద్ధాంతం వీడాలి: బండి - bandi sanjay latest dubbaka rally
దుబ్బాక అభివృద్ధి జరగాలంటే... భాజపా అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఉప ఎన్నికల నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ఎన్నిక రాష్ట్రంలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం కావాలన్నారు.
2014 నుంచి మంత్రిగా ఉన్న హరీశ్ రావు దుబ్బాకకు ఎన్ని నిధులు ఇచ్చారని ఎద్దేవా చేశారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగమన్న కేసీఆర్... ఆయన కూతురు కవిత ఒక్క ఏడాది నిరుద్యోగిగా ఉంటే తట్టుకోలేకపోయారని విమర్శించారు. రాష్ట్రంలో ఇంతమంది నిరుద్యోగులున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 'కేసీఆర్ ఫామ్ హౌస్, ప్రగతి భవన్లను బద్దలు కొట్టి మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామన్నారు. ఎంఐఎం మోచేతి నీళ్లు తాగుతూ తెరాస ప్రజలను మోస్తుందన్నారు. ప్రజలను మభ్యపెట్టి తెరాస గెలవాలని చూస్తుందన్నారు. నిజమైన అర్హులకు ఒక్కరికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదన్నారు.