స్వాతంత్ర సమర యోధుడు, సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకులను సిద్దిపేటలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ తర్వాత కులవివక్షపై పోరాడిన గొప్ప నాయకుడు జగ్జీవన్ రాం అని కీర్తించారు.
'కులవివక్షపై పోరాడిన మహనీయుడు జగ్జీవన్ రాం' - Jagjivan Ram Jayanti Celebrations
అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రాం అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మహనీయుని ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.
బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకులు
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ఎస్సీ ఉద్యోగ కల్పన పథకం కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించామని మంత్రి వెల్లడించారు. మహనీయుని ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.