తెలంగాణ

telangana

ETV Bharat / state

దుబ్బాక ఠాణాలో విద్యార్థులకు పోలీస్ వ్యవస్థ పనితీరుపై అవగాహన - 'దుబ్బాక ఠాణాలో విద్యార్థులకు పోలీస్ వ్యవస్థ పనితీరుపై అవగాహన'

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఠాణాలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పోలీస్ వ్యవస్థ విధులు, యంత్రాంగం గురించి అవగాహన కార్యక్రమం చేపట్టారు.

పోలీస్ వ్యవస్థ విధులు, యంత్రాంగం గురించి విద్యార్థులకు అవగాహన
పోలీస్ వ్యవస్థ విధులు, యంత్రాంగం గురించి విద్యార్థులకు అవగాహన

By

Published : Dec 16, 2019, 11:41 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్ స్టేషన్​లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పోలీస్ వ్యవస్థ పనితీరుపై అవగాహన నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 41 బాల బాలికలకు ఠాణాలోని వివిధ శాఖల విధుల గురించి వివరించారు. పోలీసులు అందించే సేవల గురించి దుబ్బాక ఎస్సై మన్నె స్వామి తెలిపారు.
ఈ సందర్భంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ గది, కారాగారం, ఆయుధాగారం, ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్​కు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకునే వైర్​లెస్ యంత్రం గురించి అవగాహన కల్పించారు. ఆపద సమయాల్లో అందరూ డయల్ 100 కు ఫోన్​ చేసి సేవలను పొందాలని సూచించారు.

పోలీస్ వ్యవస్థ విధులు, యంత్రాంగం గురించి విద్యార్థులకు అవగాహన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details