తెలంగాణ

telangana

ETV Bharat / state

నులిపురుగుల వ్యాధితో ఎవరూ బాధపడకూడదు - సిద్దిపేట జిల్లా

నులి పురుగుల వ్యాధితో బాధపడేవారు సిద్దిపేట జిల్లాలో ఎవరూ ఉండకుండా అధికారులు కృషి చేయాలని మాజీ మంత్రి హరీశ్​ రావు సూచించారు. నులిపురుగుల నివారణకు చేపట్టిన అవగాహన ర్యాలీలో హరీశ్​ రావు పాల్గొన్నారు.

నులిపురుగుల వ్యాధితో ఎవరూ బాధపడకూడదు

By

Published : Aug 7, 2019, 4:49 PM IST

నులిపురుగుల వ్యాధితో ఎవరూ బాధపడకూడదు
నులి పురుగుల నివారణకు కోసం సిద్దిపేట పాత బస్టాండ్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. ఎలాంటి అపోహలకు తావివ్వకుండా నులి పురుగుల నివారణకు మాత్రలు వినియోగించుకోవాలన్నారు. గతంలో 97 శాతం మందికి వేయగా ఈ ఏడు 99 శాతానికి పెరగాలని సూచించారు. ఆగస్టు 8న పంపిణీ జరుగుతుందని హరీశ్​ రావు పేర్కొన్నారు. ఈ వ్యాధితో బాధపడేవారు జిల్లాలో ఉండకూడదని.. దానికి అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details