సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ఎన్నికల సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళికేరి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను వివరించారు. లెక్కింపు ప్రక్రియలో 14 టేబుళ్లలో 23 రౌండ్లలో కౌంటింగ్ ఉంటుందని కలెక్టర్ భారతి హోళికేరి తెలిపారు. కౌంటింగ్ కోసం నియమించిన సిబ్బంది ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఉదయం 5 గంటలకల్లా లెక్కింపు కేంద్రానికి రావాలని సూచించారు.
దుబ్బాక ఎన్నికల ఓట్ల లెక్కింపుపై అవగాహన కార్యక్రమం
దుబ్బాక ఉపఎన్నిల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో సిద్దిపేట జిల్లాలోని ఎన్నికల సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళికేరి కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కౌంటింగ్ కోసం నియమించిన సిబ్బంది ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఉదయం 5 గంటలకల్లా లెక్కింపు కేంద్రానికి రావాలని సూచించారు.
దుబ్బాక ఎన్నికల ఓట్ల లెక్కింపుపై అవగాహన కార్యక్రమం
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లాలని హోళికేరి తెలిపారు.
ఇదీ చదవండి:పరిశోధన ఫలితాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి: వెంకయ్య నాయుడు