సిద్దిపేట జిల్లా సికింద్లాపూర్ దర్గపల్లి శివారులో ఆదివారం రాత్రి వాగులో కొట్టుకుపోయిన ఇన్నోవా లభ్యమైంది. వాహనంతో పాటు గల్లంతైన జంగంపల్లి శ్రీనివాస్ కోసం రెండోరోజు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాజగోపాల్ పేట ఎస్ఐ అశోక్.. చిన్నకోడూరు మండలం తహసీల్దార్ శ్రీనివాసరావు వాగు వద్ద చేరుకొని గాలింపు చర్యలు పర్యవేక్షించారు.
వాగులో కొట్టుకుపోయిన ఇన్నోవా లభ్యం... వ్యక్తి కోసం గాలింపు - innova car missing in sikindlapur
ఆదివారం రాత్రి సిద్దపేట జిల్లా సికింద్లాపూర్ పరిధిలోని ఓ వాగులోని ప్రవాహ ఉద్ధృతికి ఇన్నోవా కారు కొట్టుకుపోయింది. అందులో ఉన్న వ్యక్తి గల్లంతయ్యాడు. వాహనం లభ్యం కాగా... వ్యక్తి కోసం గాలింపు ముమ్మరం చేశారు.
![వాగులో కొట్టుకుపోయిన ఇన్నోవా లభ్యం... వ్యక్తి కోసం గాలింపు వాగులో కొట్టుకుపోయిన ఇన్నోవా లభ్యం... వ్యక్తి కోసం గాలింపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8471750-915-8471750-1597802810961.jpg)
వాగులో కొట్టుకుపోయిన ఇన్నోవా లభ్యం... వ్యక్తి కోసం గాలింపు
9 మందితో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సుమారు 20 గజాల దూరంలో ఇన్నోవా ఆచూకీ లభ్యమైంది. క్రేన్ సహాయంతో వాహనాన్ని బయటకు తీశారు. అనంతరం వాగులో గల్లంతైన శ్రీనివాస్ ఆచూకీ కోసం సమీపంలో ఉన్న చెక్ డ్యాం పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ సాయంత్రం వరకు చేపట్టినా ప్రయోజనం కనిపించలేదు.