తెలంగాణ

telangana

By

Published : Jun 4, 2021, 6:09 PM IST

ETV Bharat / state

భారీగా నకిలీ విత్తనాలు స్వాధీనం.. నిందితుల అరెస్ట్

సిద్దిపేట జిల్లాలో నకిలీ విత్తనాల గుట్టు రట్టైంది. వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున నకిలీ వరి విత్తనాలు పట్టుబడ్డాయి. సుమారు రూ. 5 కోట్ల విలువైన నకిలీ విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Seizure of counterfeit seeds in siddipet district
సిద్దిపేట జిల్లాలో నకిలీ విత్తనాలు పట్టివేత

రాష్ట్రంలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నవారిపై పోలీసులు కొరడా ఝులిపించారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం శ్రీరాంపూర్‌లో భారీగా నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి....సుమారు రూ. 5కోట్ల విలువైన 2వేల 384 కిలోల విత్తనాలను సీజ్‌ చేశారు. నిందితులను అరెస్టు చేసి పీఎస్​కు తరలించారు.

నకిలీ విత్తనాల రవాణాను నిలువరించేందుకు... జిల్లా, మండల స్థాయిల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు సిద్దిపేట సీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. ఎక్కడ నకిలీ విత్తనాల జాడ కనిపించినా పోలీసులకు ఫిర్యాదు చేయాలని రైతులకు సూచించారు.

ఇదీ చదవండి:Cyber Crime: మాటలతో ఎరవేసి.. ఆన్‌లైన్‌లో దోచేసి!

ABOUT THE AUTHOR

...view details