సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరంలో బాల్య వివాహం చేస్తున్నారనే సమాచారంతో ఎస్సై, తహసీల్దార్, సీడీపీవోలు సిబ్బందితో గ్రామానికి వెళ్లి బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. అక్కడికి చేరుకొని బాలికకు 16 సంవత్సరాలు ఉన్నాయని విచారణలో తెలుసుకున్న అధికారులు తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. బాలిక వయసు 18 సంవత్సరాలు నిండే వరకు మళ్లీ వివాహం చేసే ప్రయత్నం చేయవద్దని తల్లిదండ్రులతో రాతపూర్వకంగా ప్రమాణపత్రాన్ని స్వీకరించారు.
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు - సిద్దిపేట జిల్లా వార్తలు
సిద్దిపేట జిల్లా రామవరం గ్రామంలో అధికారులు బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. బాలికకు 18 ఏళ్లు వచ్చే వరకు వివాహం చేయెుద్దని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని బాలికల వయస్సు 18 సంవత్సరాలు, బాలుర వయసు 21 సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహాలు చేయాలని లేకపోతే తల్లిదండ్రులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఇవీ చూడండి: దంపతుల హత్య కేసులో నిందితుల అరెస్ట్