సిద్దిపేట పట్టణ మున్సిపల్ వైస్ ఛైర్మన్ అక్తర్ పటేల్‌పై సాజిద్పురాకు చెందిన రహీం అనే వ్యక్తి తన అనుచరులతో కర్రలతో దాడి చేశాడు. దీనితో అక్తర్ పటేల్ చెయ్యికి గాయాలయ్యాయి. ఘటనాస్థలం నుంచి తప్పించుకుని అక్తర్ పట్టణ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాడు.
వైస్ ఛైర్మన్‌పై కర్రలతో దాడి - వైస్ ఛైర్మన్‌పై కర్రలతో దాడి
వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న ఆరోపణలతో సిద్దిపేట మున్సిపల్ వైస్ ఛైర్మన్‌పై కొంతమంది వ్యక్తులు కర్తలతో దాడికి పాల్పడ్డారు.
వైస్ ఛైర్మన్‌పై కర్రలతో దాడి
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పట్టణానికి చెందిన ఓ వివాహితతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడన్న ఆరోపనలతోనే ఈ దాడికి పాల్పడినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:వాగ్దానాలు మరిచిన 'మంత్రిని నిలదీసిన మహిళ'