సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక శాఖలో ఉద్యోగాల ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అంబేడ్కర్ విగ్రహానికి కళాకారుల బృందం సభ్యులు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో కళాకారుల సేవలను గుర్తించి ఒక సాంస్కృతిక శాఖను ఏర్పాటు చేసి, దానికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను చైర్మన్‌గా నియమించి 550 ఉద్యోగాలను భర్తీ చేసిందని కళాకారులు తెలిపారు. నియమ నిబంధనలు పాటించకుండా అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అన్యాయం చేశారని హైకోర్టును ఆశ్రయించామన్నారు.
అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన కళాకారులు - siddipet district news
తెలంగాణ సర్కారు సాంస్కృతిక శాఖలో ఉద్యోగాల ఫలితాలను వెంటనే విడుదల చేయాలని కళాకారుల బృందం సభ్యులు అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. తుది ఫలితాలను వెంటనే విడుదల చేసి ఉద్యోగాలను కల్పించాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కళాకారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

artists protest for jobs
2018లో నియమ నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. రెండేళ్లుగా జాప్యం చేస్తూ ఇంటర్వ్యూలు తీసుకొని 6 నెలలు గడుస్తున్నా ఇంత వరకు సాంస్కృతిక శాఖ తుది ఫలితాలు విడుదల చేసి నియామకాలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తుది ఫలితాలను విడుదల చేసి అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: 'ప్రభుత్వ చర్యతో తెలంగాణ జిల్లాలు ఎడారిగా మారబోతున్నాయి'